Home Filmy Adda KGF-2 కి “సలార్”కి ఉన్న సంబంధం ఇదేనా..? వైరల్ అవుతున్న స్టోరీ..!

KGF-2 కి “సలార్”కి ఉన్న సంబంధం ఇదేనా..? వైరల్ అవుతున్న స్టోరీ..!

by Mohana Priya

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.

link between salaar and kgf 2 goes viral

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 కి కూడా సూపర్‌హిట్ టాక్ రావటంతో సలార్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేంటంటే కేజీఎఫ్ 2 లో ఈశ్వరి రావు పోషించిన పాత్ర కొడుకు మెడలో ఒక లాకెట్ ఉంటుంది. ఇదే లాకెట్ సాలార్ పోస్టర్‌లో ప్రభాస్ కూడా ధరించారు అని, దాంతో బహుశా ఈశ్వరి రావు కొడుకు పెద్దయ్యాక ప్రభాస్ అవుతారేమో, సలార్ కి, కేజీఎఫ్ 2 కి ఏమైనా సంబంధం ఉందేమో అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మీమ్ ఒకటి వైరల్ అయ్యింది.

link between salaar and kgf 2 goes viral

కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ రెండు లాకెట్స్ వేరే అని తెలుస్తోంది. కానీ కేజీఫ్ లో ఆ పాత్ర చనిపోయిన తర్వాత చూపించరు. దాంతో నిజంగా ఈ రెండు సినిమాలకి ఏమైనా సంబంధం ఉందేమో అనే వార్తలు వస్తున్నాయి.  సలార్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతు సలార్ కేవలం ఒక్క పార్ట్ సినిమా మాత్రమే. దీనికి పార్ట్ 2 లాంటివి ఏం ఉండవు అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

link between salaar and kgf 2 goes viral

You may also like