Ads
ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ యువ కార్యకర్త మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆయన నగరంలోని చర్చి కాంపౌండ్ లో ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని మొదటినుంచి వ్యతిరేకం వస్తున్నారు. దీంతో ఆయనపై 16 కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారని, దీనిపై పోలీసులను ఎన్నిసార్లు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని
Video Advertisement
మనస్తాపానికి గురైన సాయిగణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయనను మొదట ఖమ్మం ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతూ శనివారం నాడు సాయిగణేష్ మరణించారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆత్మహత్య చేసుకున్న గణేష్ మాట్లాడుతూ : మంత్రి పువ్వాడ అజయ్ ఆగడాలు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకున్నానని గణేష్ అన్నారు. పోలీసులను తన దగ్గర పెట్టుకొని టార్చర్ పెట్టారని తెలియజేశారు. దేశవ్యాప్తంగా బిజెపికి సలాం కొడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఆగడాలు ఎక్కువైపోయాయి అని ఆయన ఆరోపించారు. నాపై ఇప్పటికే 16 కేసులు పెట్టించి రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని
ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వచ్చి ఇంట్లో ఉన్న ఇల్లు ఖాళీ చేయాలని చాలా ఇబ్బందులు పెట్టాలని సాయి గణేష్ చనిపోయేముందు మీడియాకు తెలియజేశారు.
ఇదే విషయమై ఎంపీ అరవింద్ మాట్లాడుతూ బిజెపి ఎదుగుదలను జీర్ణించుకోలేక తెరాస ప్రభుత్వం కార్యకర్తలను పోలీసులతో కలిసి వేధింపులకు గురి చేస్తోందని
అన్నారు. అందుకే బిజెపి మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు సాయి గణేష్ ఆత్మహత్యాయత్నం చేసుకొని చనిపోయారని ఆరోపించారు. ఇతని మృతికి ప్రధాన కారణం పువ్వాడ అజయ్ అన్నారు.గణేష్ ఆత్మ శాంతించాలని కోరుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని తెలియజేశారు.
End of Article