Home Filmy Adda “టాటూ” గురించి అడిగిన నెటిజెన్‌కి… “సమంత” ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై..!

“టాటూ” గురించి అడిగిన నెటిజెన్‌కి… “సమంత” ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై..!

by Mohana Priya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అలాగే సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయింది.

samantha reply to a netizen about tattoo goes viral

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా పోస్ట్ చేస్తు ఉంటారు. వాటికి మిలియన్స్ సంఖ్యలో లైక్స్, వ్యూస్ వస్తాయి. సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సమంత రిపోర్టర్‌గా కనిపిస్తారు అని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. అంతే కాకుండా సమంత మరి కొన్ని బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేశారట.

samantha reply to a netizen about tattoo goes viral

సమంత నిన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఇందులో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా అడిగారు. అందుకు సమంత సమాధానాలు చెప్పారు. వీరిలో ఒక నెటిజన్ టాటూలకి సంబంధించిన ప్రశ్న అడిగారు. అందుకు అందుకు సమంత, ” నేను నా చిన్న వయసులో ఉన్న సమంతకి చెప్పే సమాధానం ఒక్కటే. ఎప్పుడు టాటూ వేయించుకోవద్దు. అసలు ఎప్పటికీ టాటూ వేయించుకోవద్దు” అని అన్నారు.

You may also like