Ads
నాచురల్ స్టార్ నాని పరిచయం అక్కర్లేని వ్యక్తి. శ్యామ్ సింఘ రాయ్ తో హిట్ కొట్టిన నాని, అంటే సుందరానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవల విడుదల అయ్యింది. ఆ తర్వాత దసరా సినిమాలో నటిస్తారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.
Video Advertisement
అలా నాని సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారు ఎవరో, వారు పరిచయమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 కలర్స్ స్వాతి
నాని హీరోగా నటించిన అష్టాచమ్మా సినిమాతోనే కలర్స్ స్వాతి హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఇదే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#2 శరణ్య మోహన్
భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో శరణ్య మోహన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇది శరణ్య మోహన్ మొదటి తెలుగు సినిమా.
#3 నిత్యా మీనన్
అలా మొదలైంది సినిమాతో నిత్యా మీనన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
#4 మాళవికా నాయర్
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మాళవిక నాయర్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.
#5 మెహ్రీన్ పిర్జాదా
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో మెహ్రీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#6 నివేతా థామస్
జెంటిల్మెన్ సినిమాతో నివేతా తన తెలుగు సినిమా కెరీర్ మొదలు పెట్టారు.
#7 అనూ ఇమాన్యుల్
మజ్ను సినిమాతో అనూ ఇమాన్యుల్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
#8 రియా సుమన్
మజ్ను సినిమాతో రియా సుమన్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
#9 శ్రద్ధా శ్రీనాథ్
అంతకుముందు కన్నడ, తమిళంలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నానితో జెర్సీ సినిమాలో మొదటి సారిగా నటించారు.
#10 ప్రియాంక అరుల్ మోహన్
నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.
#11 నజ్రియా నజీమ్
అంటే సుందరానికి సినిమాతో నజ్రియా నజీమ్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు.
అలా నాని సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్లు వీరే.
End of Article