Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం డైలాగ్స్.
అసలు కేజీఎఫ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మదర్ సెంటిమెంట్. మొదటి పార్ట్ లో కూడా మదర్ సెంటిమెంట్ హైలెట్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాగే మదర్ సెంటిమెంట్ సినిమాకి ఒక పెద్ద హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అయితే హీరో తల్లి హీరోకి ఒంట్లో బాలేదు అని హాస్పటల్ కి తీసుకువెళుతుంది. అక్కడ ఆమె తన కొడుకు గురించి గొప్పగా చెప్తుంది. ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.
“ఆమె హాస్పిటల్ కి తీసుకువెళ్లి, ఆమె తన కొడుకు గురించి గొప్పలు చెప్పడం ఏంటి?” అని. ఇంకా సినిమా విషయానికొస్తే ఇప్పుడు సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది. సినిమా చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. మరి నిజం గానే నెక్స్ట్ పార్ట్ ఉందా? ఉంటే అందులో ఎం ఉండబోతోంది? వీటి గురించి ప్రస్తుతానికి ఎలాంటి వార్తలు రాలేదు.
End of Article