Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో డార్లింగ్ సినిమా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. సినిమా వచ్చి దాదాపు పది సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ డార్లింగ్ సినిమాకి చాలా క్రేజ్ ఉంటుంది.
Video Advertisement
అప్పటివరకు ప్రభాస్ ని యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో చూసిన ప్రేక్షకులకి ప్రభాస్ కి లవ్ స్టోరీస్ కూడా సూట్ అవుతాయి అని రుజువు చేసిన సినిమా ఇది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కూడా డిఫరెంట్ గా అనిపించింది. ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండడంతో డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తొలిప్రేమ తర్వాత కరుణాకరన్ దర్శకత్వం వహించిన అంత మంచి లవ్ స్టోరీగా డార్లింగ్ నిలిచింది. ప్రభాస్, కాజల్ కాంబినేషన్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఒకరకంగా సినిమా హిట్ అవ్వడానికి వాళ్ల పెయిర్ ముఖ్య కారణంగా నిలిచింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా నటించారు.
ఈ సినిమాని వేరే భాషల్లో కూడా రీమేక్ చేశారు. కన్నడ, ఉర్దూ భాషల్లో రీమేక్ చేశారు. అలాగే హిందీలో కూడా తెలుగు సినిమాని డబ్ చేసారు. బెంగాలీలో డార్లింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఇవాళ్టితో డార్లింగ్ సినిమా విడుదల అయ్యి 12 సంవత్సరాలు అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article