మా “సారంగ దరియా” పాటని ఇలా చేసేసారేంటయ్యా..? వైరల్ అవుతున్న వీడియో..!

మా “సారంగ దరియా” పాటని ఇలా చేసేసారేంటయ్యా..? వైరల్ అవుతున్న వీడియో..!

by Mohana Priya

Ads

చాలా సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి కొంతకాలం క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు.

Video Advertisement

ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దాంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల నటన ప్లస్ పాయింట్ అయ్యింది. అంతే కాకుండా శేఖర్ కమ్ముల సినిమా అవడంతో సినిమా అంతా చాలా నాచురల్ గా ఉంటుంది.

saranga dariya hindi remake song goes viral

సినిమాకి థియేటర్స్ లో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, టీవీ లో టెలికాస్ట్ అయిన ఇప్పుడు కూడా అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా చాలా సార్లు టీవీ లో టెలికాస్ట్ చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల స్థానంలో నాగ చైతన్య, సాయి పల్లవిని కాకుండా ఇంకా ఎవరినైనా సరే ఊహించుకోవడం కష్టం. ముఖ్యంగా కొన్ని పాటల్లో సాయి పల్లవి డాన్స్ అయితే రికార్డ్ క్రియేట్ చేసింది. అందులో సారంగ దరియా పాట ఒకటి.

ఈ పాట పూర్తి వీడియో విడుదల అవ్వకముందే యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటతో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ పాటని హిందీలో రీమేక్ చేశారు. ఆ హిందీ రీమేక్ సాంగ్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ పాటకి మంచి కామెంట్స్ వస్తున్నాయి. దాంతోపాటు నెగిటివ్ కామెంట్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం మన తెలుగు పాటకి మొత్తం ఆపోజిట్ గా హిందీ పాట ఉంది. దాంతో, “తెలుగులో అంత బాగా చేసిన పాటను హిందీలో అలా చేసారు ఏంటి?” అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


End of Article

You may also like