Ads
కొరటాల శివ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకెళ్తున్న వారిలో ఒక్కరు. ఈయన సినిమాల్లో జనాలను ఆకట్టుకునే ఏదో ఒక కొత్త అంశం తప్పనిసరిగా ఉంటుంది. సినిమా డైలాగ్ నుంచి మొదలు ఎండింగ్ వరకు ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపించడంలో దిట్ట.
Video Advertisement
ఇక పాటల విషయానికి వస్తే ఆయన ఏ మాత్రం తగ్గరు అని చెప్పవచ్చు. ఆ పాటలో తగ్గట్టే నటీనటులను ఎంపిక చేసుకొని 100% న్యాయం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ హీరోలు గా వస్తున్న ఆచార్య ఈనెల 29వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం..!!
మిర్చి సినిమాలో నందిని:ఈయన చేసిన సినిమాలు ఎన్నో విజయవంతంగా దూసుకెళ్లాయి. మిర్చి సినిమాతో మొదటిసారిగా దర్శకుడిగా మారి సక్సెస్ఫుల్ అందుకున్నాడు. ఇందులో పాటలు దేవి శ్రీ ప్రసాద్ అందించారు… “మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే” అంటూ ఇందులో హంసనందిని ఎంపిక చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ పాట ఆ సమయంలో కుర్రకారులో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పవచ్చు.
జనతా గ్యారేజ్ లో కాజల్:ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ జనతాగ్యారేజ్ . ఈ సినిమాలో కథానాయిక కాజల్ ను “పక్కా లోకల్ అంటూ” స్టెప్పులు వేయించాడు. ఇందులో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాజల్ నేను లోకల్ అంటూ పలికిన మాటలు ఆ భావాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
శ్రీమంతుడు మూవీలో పూర్ణ:కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. ఇందులో “రాములోడు వచ్చినాడురో” అనే పాటలో పూర్ణను స్టెప్పులు వేయించాడు. ఇందులో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్ణ ఎంట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఆచార్య మూవీలో సంగీత:ఈయన తన దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఐదవ సినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా “లాహే లాహే “అనే పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన సంగతులు వివరించడం కోసం సంగీత తెరపైకి వచ్చిందని, ఇందులో చిరంజీవికి పోటీగా నృత్యం చేసిందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది ఇలా కొరటాల శివ ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణని ఉంచుతూ కొత్తదనాన్ని చూపించడంలో దిట్ట అని చెప్పవచ్చు.
End of Article