Ads
విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కన్మణి రాంబో ఖతీజా. ఈ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే తమిళ సినిమాని తెలుగులో ఆ పేరుతో డబ్ చేసారు.
Video Advertisement
ఈ సినిమాలో ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలని ప్రేమిస్తే, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది. నయనతార, సమంత కలిసి నటించడం ఇదే మొదటిసారి. అలాగే చాలా రోజుల తర్వాత మళ్లీ సమంత ఒక కామెడీ రోల్ చేశారు.
ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. సినిమా ప్రమోషన్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. ఈ సినిమా పాటలు సినిమా విడుదల అవ్వక ముందే విడుదల అయ్యి హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే సినిమా విడుదల అయ్యే ముందు సినిమా బృందం సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. అందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కూర్చొని ఉన్నారు. అయితే నయనతార సెల్ఫీ తీసిన ఫోటోలో సమంత సీరియస్ గా చూస్తున్నారు.
అలాగే సమంత సెల్ఫీ తీసిన ఫోటోలో నయనతార సీరియస్ గా చూస్తున్నారు. ఇది సినిమాలో భాగంగానే చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి మంచి టాక్ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ సినిమా చూసాము అని అంటున్నారు. ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఒక రిపోర్టర్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు సమాచారం. అలాగే ఒక బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు.
End of Article