యాంకర్ సుమతో కలిసి డాన్స్ చేసిన ఈమె ఎవరో గుర్తుపట్టారా.?

యాంకర్ సుమతో కలిసి డాన్స్ చేసిన ఈమె ఎవరో గుర్తుపట్టారా.?

by Sainath Gopi

Ads

ఒక స్టార్ హీరో సినిమా కి సంబంధించి ఈవెంట్ అయినా, చిన్న హీరో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. అటు బడా ఈవెంట్ల నుంచి మొదలు కొని బుల్లితెర పై షోల వరకు సుమ కనకాల ఉంటారు. ఆమె షెడ్యూల్ లో ఒక రోజు కూడా తీరిక లేకుండా ఉంటారు.

Video Advertisement

అచ్చ తెలుగుని గడగడా మాట్లాడేసే సుమని చూస్తే.. ఎవ్వరు ఆమెను కేరళ అమ్మాయి అని అనుకోరు. కేరళ అమ్మాయి అయిన యాంకర్ సుమ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తరువాత తెలుగు వారింటికి కోడలిగా వచ్చేసారు. అంతే కాదు.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు సినిమా అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇక బుల్లితెరపై ఆమె చేసే సందడిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

watch video:

https://www.instagram.com/reel/CdFnNY7FNCo/?igshid=YmMyMTA2M2Y=

ప్రస్తుతం జయమ్మ పంచాయితీ సినిమాలో నటిస్తున్న సుమ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా “అమ్మ చేతి వంట” ఫేమ్ “భార్గవి” తో కలిసి డాన్స్ కూడా చేసారు సుమ. చాలా మంది వంట చేయడానికి యు ట్యూబ్ పై డిపెండ్ అవుతారు.. యు ట్యూబ్ లో చూసి చేసే వంటలు సరిగ్గా కుదరవు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే.. ఈ అపోహలన్నిటికి పక్కకు నెట్టి అమ్మ చేతి వంట ను మనం కూడా సులువు గా చేసుకునేలా టిప్స్ చెప్తూ వంటల వీడియోస్ తో చాలా మంది తెలుగు వారికి దగ్గరయ్యారు భార్గవి. “అమ్మ చేతి వంట” ఛానెల్ తో ఆమె చాలామందికి పరిచయమయ్యారు. రకరకాల వంటలను, మన పాత కాలం నాటి వంటలను కూడా కమ్మ గా ఎలా చేసుకోవాలో ఆమె వీడియో లో చేసి చూపిస్తున్నారు.


End of Article

You may also like