66 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న అరుణ్ లాల్.!

66 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న అరుణ్ లాల్.!

by Sunku Sravan

Ads

ప్రేమ గుడ్డిది అన్నట్టే పెళ్లికి కూడా ఏజ్ తో సంబంధం లేదు అనే విషయాన్ని మాజీ క్రికెటర్ అయిన అరుణ్ లాల్ నిజం చేశారు. 66 ఏళ్ల ఏజ్ లో కూడా రెండో వివాహం చేసుకున్నారు. అది కూడా తన కన్నా 28 సంవత్సరాలు చిన్నదైనా బుల్బుల్ సహానిని వివాహమాడారు. టీమిండియా మాజీ క్రికెటర్ అరుణ్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. 66 లో అరుణ్ లాల్ తన గర్ల్ ఫ్రెండ్ ను సహాని మే రెండవ తేదీన వివాహం చేసుకున్నాడు.

Video Advertisement

టీమిండియాలో 1982లో ఎంట్రీ ఇచ్చిన అరుణ్ లాల్ 13 వన్డేలు, 16 టెస్టులు మొత్తం 850 పరుగులు, ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆయన క్రికెటర్ గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు కామెంటేటర్ గా సేవలను కూడా అందించారు. తర్వాత 2016లో క్యాన్సర్ తో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాని నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తనకీ తన మొదటి భార్యకు తోడుగా ఉంటున్న బుల్బుల్ సహాని వివాహం చేసుకున్నాడు.

కోల్కత్తా లో జరిగిన ఈ పెళ్ళికి బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ హాజరయ్యారు. 66 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బుల్బుల్ సోహాని ని అరుణ్ లాల్ ముద్దులతో ముంచెత్తుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో “ముసలోడి కానీ” అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like