Ads
- చిత్రం : సర్కారు వారి పాట
- నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని.
- నిర్మాత : రవిశంకర్, నవీన్, రామ్ ఆచంట, గోపి ఆచంట
- దర్శకత్వం : పరశురామ్
- సంగీతం : తమన్
- విడుదల తేదీ : మే 12, 2022
Video Advertisement
స్టోరీ :
మహేష్ (మహేష్ బాబు) యుఎస్ఎలో మహీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని ఆ అప్పు వసూలు చేసుకుంటాడు. ఆ అప్పు ఎంత చిన్నదైనా సరే. ప్రతి ఒక్క రూపాయి చాలా ముఖ్యమైనది అనే విధానంతో ఉంటాడు. కళావతి (కీర్తి సురేష్) మహేష్ దగ్గర అప్పు తీసుకోవడానికి వస్తుంది. మహేష్ కళావతికి అప్పిస్తాడు. కానీ కళావతి చేసిన ఒక పని వల్ల మహేష్ వైజాగ్ కి రావాల్సి వస్తుంది. అక్కడ రాజేంద్రనాథ్ (సముద్రఖని)తో మహేష్ కి గొడవలు ఏర్పడతాయి. మహేష్ వాటిని ఎలా పరిష్కరించాడు? అక్కడ ఏర్పడిన సమస్య ఏంటి? ఆ సమస్యల్లో చిక్కుకున్న వారందరినీ మహేష్ ఎలా కాపాడాడు? మహేష్ తాను అనుకున్నది చేశాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు పాత్ర కొత్తగా ఉండబోతోందని ప్రేక్షకులకు అర్థం అయ్యింది. సినిమా బృందం కూడా మహేష్ బాబు పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. మనకి ట్రైలర్ లో చూపించినట్టుగానే మహేష్ పాత్ర ఈ సినిమాలో చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ మహేష్ బాబుని ఇలా చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఇంత ఎనర్జిటిక్ గా మహేష్ బాబును చూసి చాలా కాలం అయ్యింది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తారు. కొన్ని సంవత్సరాల నుండి ఫ్యాన్స్ ఎలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నారో ఈ సినిమాలో అలాగే కనిపిస్తారు. డ్రెస్సింగ్ స్టైల్ నుండి అన్ని విషయాల వరకు కొత్తగా ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కీర్తి సురేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంది.
ఇప్పటివరకు కీర్తి కూడా అలాంటి పాత్ర పోషించలేదు. అలాగే చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. ముఖ్యపాత్రల్లో నటించిన సముద్రఖనితో పాటు వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి మిగిలిన వాళ్లు కూడా బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్ చాలావరకు సినిమాకి ఒక పెద్ద ప్లస్ అయ్యింది. మహేష్ బాబుకి, వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. అలాగే మహేష్ బాబు, కీర్తి సురేష్ కెమిస్ట్రీ కూడా బాగుంది. కానీ స్టోరీలో పెద్ద కొత్తదనం ఏమీ కనిపించదు. కొన్ని సీన్స్ ఇంకా బాగా రాసుకుని ఉండొచ్చేమో అనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నా కూడా స్టోరీ నెక్స్ట్ సీన్స్ లో ఏమౌతుంది అనే ఆసక్తి ఉండదు. సినిమా చూసే ప్రేక్షకుడికి అర్థం అయిపోతూ ఉంటుంది. తమన్ ఇచ్చిన పాటలు అయితే సినిమాకి ఒక పెద్ద హైలైట్ అయ్యాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేసింది. అలాగే కొరియోగ్రఫీ కూడా మరొక ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- మహేష్ బాబు పాత్ర
- కామెడీ సీన్స్
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
- ఫైట్స్
మైనస్ పాయింట్స్:
- కథలో లోపించిన కొత్తదనం
- ఇంతకుముందు మనం ఎక్కడో చూశాం అనిపించే సీన్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
కొత్త కథ ఉండాలి, ట్విస్ట్ లు ఉండాలి ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక కొత్త మహేష్ బాబుని చూడాలి, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఎంజాయ్ చేయాలి అనుకునే వారిని మాత్రం సర్కారు వారి పాట అస్సలు నిరాశపరచదు. ఈ సంవత్సరం వచ్చిన మంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది.
End of Article