Home Filmy Adda మహేష్ బాబుతో మొదటి సినిమా చేసి…తర్వాత సక్సెస్ అవ్వలేకపోయిన 6 హీరోయిన్స్.!

మహేష్ బాబుతో మొదటి సినిమా చేసి…తర్వాత సక్సెస్ అవ్వలేకపోయిన 6 హీరోయిన్స్.!

by Sainath Gopi

ఒక సంవత్సరంలో మన ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో కొంత మంది పెద్ద హీరోల సినిమాల ద్వారా కూడా పరిచయం అవుతారు. అయితే కొంత మందికి అదృష్టం కలిసి వస్తే, కొంత మంది మాత్రం అనుకున్నంత విజయం సాధించరు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ద్వారా కూడా కొంత మంది హీరోయిన్లు పరిచయం అయ్యారు. కానీ వారు తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన ఫలితాన్ని పొందలేదనే చెప్పాలి.

#1. బిపాసా బసు & లీసారే

టక్కరిదొంగ సినిమాతో బాలీవుడ్ నటి బిపాసా బసు, అలాగే లీసారే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత వారిద్దరూ మన సినిమాల్లో అంతగా కనిపించలేదు.

Common point in heroines introduced by Mahesh Babu

#2. నమ్రత శిరోద్కర్

వంశీ సినిమాతో నమ్రత శిరోద్కర్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ నమ్రత శిరోద్కర్ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు.

#3. అమృతా రావు

అతిథి సినిమాతో అమృతా రావు కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ అమృతా రావు తర్వాత ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించారు.

#4. కృతి సనన్ 

1 నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ పరిచయం అయ్యారు. తర్వాత కృతి సనన్ తెలుగులో నటించిన దోచేయ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ హిందీలో మాత్రం హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో మళ్లీ తెలుగు సినిమాలో కనిపిస్తారు కృతి సనన్.

Common point in heroines introduced by Mahesh Babu#5. కియారా అద్వానీ

కియారా అద్వానీ కూడా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత కియారా హీరోయిన్ గా నటించిన వినయ విధేయ రామ సినిమా  బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు.

Common point in heroines introduced by Mahesh Babu

ఇప్పుడు కియారా అద్వానీ, రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. బహుశా కియారా అద్వానీ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని ఆశిద్దాం.

You may also like