Home Filmy Adda అప్పుడు “నాని” సరదాకి అన్నమాట ఇప్పుడు నిజం అయ్యిందిగా..? వైరల్ అవుతున్న పాత వీడియో..!

అప్పుడు “నాని” సరదాకి అన్నమాట ఇప్పుడు నిజం అయ్యిందిగా..? వైరల్ అవుతున్న పాత వీడియో..!

by Mohana Priya

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో చేసి తెలుగులో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి ఒక V చిత్రం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అలాగే తెలుగులో కూడా గుండెల్లో గోదారి సినిమాలో నటించారు.

హీరోగా మాత్రమే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు ఆది పినిశెట్టి. ఇటీవల క్లాప్ సినిమాలో నటించారు.

nani speech at marakathamani audio launch goes viral

ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ద వారియర్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇందులో ఆది పినిశెట్టి ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసారు. దానికి చాలా మంచి స్పందన లభించింది. ఇటీవల ఆది పినిశెట్టి పెళ్లి జరిగింది. ప్రముఖ నటి నిక్కీ గల్రానీతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఆది పినిశెట్టి కొంతకాలం క్రితం ప్రకటించారు.

nani speech at marakathamani audio launch goes viral

అలాగే ఇటీవల ఆది పినిశెట్టి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి నాని, అలాగే ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన కూడా హాజరయ్యారు. నాని, ఆది పినిశెట్టి కలిసి నిన్ను కోరి సినిమాలో నటించారు. అయితే నాని ఒక టైంలో చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొద్ది సంవత్సరాల క్రితం నాని, ఆది హీరోగా నటించిన మరకతమణి సినిమా ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. అందులో నాని సినిమా గురించి మాట్లాడారు అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన నిక్కీ గల్రాని గురించి మాట్లాడుతూ, “ఆది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో చాలా బాగుంది” అని సరదాగా అన్నారు. నిజంగా నాని చెప్పినట్టే జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.

Watch video :

 

You may also like