Home Filmy Adda NTR: ఎన్టీఆర్ కు ఆ ఒక్క కోరిక తీరలేదట.. అదేంటో తెలుసా..?

NTR: ఎన్టీఆర్ కు ఆ ఒక్క కోరిక తీరలేదట.. అదేంటో తెలుసా..?

by Sainath Gopi

అన్న గారు స్వర్గస్తులైన తర్వాత ఆ ఇంటి వారసత్వాన్ని నిలబెట్టడానికి ఎవరొస్తారా అని అభిమానులంతా ఎదురు చూసారు. అలాంటి నటుడు తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ దొరకరేమో అని కొందరు దిగులుచెందారు. కానీ 6 ఏళ్ల తర్వాత పెద్దాయన లాగే రూపురేఖలు, ఆయన లాగే నటన ప్రావీణ్యం ఉన్న ఆయన మనవడు వచ్చాడు. నందమూరి తారక రామా రావు అనే పేరుతో సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసి ఆ పేరుని నిలబెట్టాడు.

ఓ వైపు సినిమాకు ప్రాధాన్యతని ఇస్తూ.. మరోవైపు కుటుంబాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించుకున్న హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే.. అది తారక్ లోని కృషి, పట్టుదలకు తార్కాణం.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తారక్ తన ఫామిలీ తో కూడా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు. 2011 లోనే ఎన్టీఆర్ కు లక్ష్మి ప్రణతితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు జన్మించిన సంగతి తెలిసిందే. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్.

Jr NTR Lakshmi Pranathi Son Abhay Ram Latest New HD Photos Images

నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి విషయాలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఎంత సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నా.. ఎన్టీఆర్ కు ఓ తీరని కోరిక మిగిలిపోయిందట. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి రెండవ సారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడుతుందని.. నందమూరి వంశానికి ఆడపడచు వస్తుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డారట. సహజంగానే ఆడవారంటే గౌరవ మర్యాదలు కలిగి ఉన్న ఎన్టీఆర్ తనకో కూతురు పుడితే బాగుంటుందని అనుకున్నారట. కానీ, రెండవసారి కూడా అబ్బాయే పుట్టేసరికి కొంత నిరుత్సాహ పడ్డారట.

You may also like