“ఆచార్య”లో ఇది గమనించారా.? మీకూ అదే డౌట్ వచ్చిందా..?

“ఆచార్య”లో ఇది గమనించారా.? మీకూ అదే డౌట్ వచ్చిందా..?

by Mohana Priya

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.

Video Advertisement

ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.

సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. చిరంజీవి నటన బాగున్నా కూడా చాలా సీన్స్ లో చాలా డల్ గా ఎనర్జీ లేకుండా నటించారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సహాయ పాత్రల్లో చాలా మంది తెలిసిన నటులు ఉన్నాకూడా పెద్దగా హైలెట్ అయ్యే పాత్రలు ఎవరివి లేవు. అంతే కాకుండా కాజల్ పాత్ర కూడా సినిమా నుండి కట్ చేశారు. అసలు కాజల్ పాత్ర సినిమా నుండి తీసేయడానికి కారణం ఏంటి అనేది తెలియదు.

acharya movie review

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. సోను సూద్ కి సంబంధించిన ఒక వ్యక్తిని హీరో కొడతాడు. అతనిని బోట్ లో తీసుకొని సోను సూద్ ఇంటికి వెళ్తాడు. అయితే ఈ సీన్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం బోట్ లో ఉన్నా కూడా అతనిని భుజం మీద వేసుకుని వెళ్లడం. దాంతో చాలా మంది, “అతనిని బోట్ లో పెట్టి తీసుకెళ్లొచ్చు కదా? అలా భుజం మీద పెట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి?” అని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like