Home Filmy Adda “ఈశ్వరీ రావు”తో పాటు… “సలార్”లో ఉండబోయే KGF-2 పాత్రలు వీరేనా..?

“ఈశ్వరీ రావు”తో పాటు… “సలార్”లో ఉండబోయే KGF-2 పాత్రలు వీరేనా..?

by Mohana Priya

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.

అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది.

kgf chapter 2 characters that might be there in salaar

ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాకి సంబంధం ఉన్నట్టు చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మరో వార్త బయటకి వచ్చింది కేజీఎఫ్ సినిమాలో కనిపించిన కొంత మంది నటులు సలార్ లో కూడా కనిపిస్తారు.

kgf chapter 2 characters that might be there in salaar

ఆల్రెడీ ఇప్పటికే కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. వారు కాకుండా మరో కొంతమంది కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. రవీనా టాండన్ పోషించిన రమికా సేన్ పాత్రతో ఉన్న పోలీస్ ఆఫీసర్, అలాగే పార్లమెంట్ దగ్గర జరిగే సీన్ లో గన్స్ పట్టుకొని ఉన్న వాళ్ళు ఈ సినిమాలో కూడా కచ్చితంగా కనిపిస్తారు. ప్రస్తుతం అయితే ఈ వార్త వైరల్ అవుతోంది. సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

You may also like