Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యి ఇప్పుడు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చింది. పే పర్ వ్యూ ఈ పద్ధతిలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
Video Advertisement
ఇంకా కొద్ది రోజుల్లో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెడతారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ఇదే.
అలాగే మహేష్ బాబు, పూజా హెగ్డే కలిసి అంతకుముందు మహర్షి సినిమాలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి బయటికి వచ్చిన ఒక ట్వీట్, అలాగే ఆ ట్వీట్‌కి ఒక నెటిజన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్‌లో SSMB 28 కాస్టింగ్ అని రాసి సినిమాలో నటించే నటీనటుల ఎంపిక గురించి చాలా బాగుంది అని అర్థం వచ్చేలాగా రాశారు. దానికి ఒక నెటిజన్ కాస్టింగ్ అనే పదాన్ని కులం అనుకొని, “నువ్వు ఆపు సామి. గురూజీ అక్కడ. కాస్ట్ ఫీలింగ్ ఏమీ ఉండదు ఆయనకి. నువ్వు తెలియకుండా కాస్టింగ్ అని నిందలు వేయకు.” అని రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article