Major Review : మేజర్ సినిమాతో “అడివి శేష్”కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Major Review : మేజర్ సినిమాతో “అడివి శేష్”కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : మేజర్
  • నటీనటులు : అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్.
  • నిర్మాత : మహేష్ బాబు, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి
  • దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
  • సంగీతం : శ్రీ చరణ్ పాకాల
  • విడుదల తేదీ : జూన్ 3, 2022

major movie review

Video Advertisement

స్టోరీ :

26/11 సమయంలో 2008లో ముంబైలో జరిగిన దాడుల్లో ఎంతోమంది ప్రజలని కాపాడుతూ తన ప్రాణాలను పోగొట్టుకున్న సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సందీప్ ఉన్నికృష్ణన్ (అడివి శేష్) చిన్నతనంలో ఎలా ఉండేవాడు అనే విషయాన్ని చూపిస్తూ సినిమా మొదలవుతుంది. అసలు సందీప్ ఎందుకు ఆర్మీ లో చేరాలి అనుకున్నాడు? సందీప్ కి, ఈషా (సయీ మంజ్రేకర్)కి పరిచయం ఎలా ఏర్పడింది? ట్రైనింగ్ ఆఫీసర్ గా చేసే సమయంలో సందీప్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

major movie review

రివ్యూ :

ఈ సినిమా సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కేవలం తెలుగు, హిందీలో రూపొందించడం మాత్రమే కాకుండా మలయాళంలో కూడా విడుదల చేశారు. బయోపిక్ కి ముఖ్యంగా కావాల్సింది సినిమాలో నటించే నటీనటులు పాత్రలకు సరిపోవడం. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో ఆ పాత్ర పోషించిన ప్రతి నటులు ఆ పాత్రకి సరిగ్గా సరిపోయారు. అందులోనూ ముఖ్యంగా అడివి శేష్ అయితే చాలా చోట్ల సందీప్ ఉన్నికృష్ణన్ లాగానే కనిపించారు. ఇందుకోసం అడివి శేష్ చాలా కష్టపడ్డారు. ఆ కష్టం మొత్తం తెరమీద కనిపిస్తుంది. అడివి శేష్ తర్వాత సినిమాలో అంత హైలైట్ అయిన పాత్ర సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర. సినిమా మొత్తం ప్రకాష్ రాజ్ పాత్ర ప్రేక్షకులకు చెప్తూ ఉంటారు. హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్, అతిధి పాత్రలో నటించిన శోభితా ధూళిపాళ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

major movie review

సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి పాత్రలో నటించిన రేవతి కూడా బాగా నటించారు కానీ కొద్ది సేపు మాత్రమే కనిపిస్తారు. ఒక ముఖ్య పాత్రలో నటించిన మురళీ శర్మ, అనీష్ కురువిల్లా, అతుల్ కులకర్ణి వంటి నటులు కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. సినిమాకి ముఖ్య హైలైట్ మాత్రం శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని మరొక లెవెల్ కి తీసుకెళ్లారు. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు శశి కిరణ్ తిక్క కూడా ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటనని కళ్ళకి కట్టినట్టుగా ప్రేక్షకులకి చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా నిజజీవితంలో సందీప్ ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు ఏమో అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సినిమా చివరికి వచ్చేటప్పటికీ చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పెర్ఫార్మెన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • నిర్మాణ విలువలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కొంచెం స్లోగా సాగే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

3.5/5

ట్యాగ్ లైన్ :

ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్న, భారతదేశం గర్వించదగ్గ వారిలో ఒకరైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి ఈ సినిమా ఒక నివాళిగా నిలుస్తుంది.


End of Article

You may also like