Vikram Hitlist Review : విక్రమ్ సినిమాతో “కమల్ హాసన్” పాన్-ఇండియన్ స్టార్ అయినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Vikram Hitlist Review : విక్రమ్ సినిమాతో “కమల్ హాసన్” పాన్-ఇండియన్ స్టార్ అయినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : విక్రమ్ హిట్‌లిస్ట్
  • నటీనటులు : కమల్ హాసన్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి.
  • నిర్మాత : కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
  • దర్శకత్వం : లోకేష్ కనకరాజ్
  • సంగీతం : అనిరుధ్ రవిచందర్
  • విడుదల తేదీ : జూన్ 3, 2022

kamal haasan vikram hitlist review

Video Advertisement

స్టోరీ :

సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచన్ (కాళిదాస్ జయరామ్) అనే ఒక అమరవీరుడి తండ్రి అయిన కర్ణన్ (కమల్ హాసన్) హత్యకు గురవుతారు అనే విషయంతో సినిమా మొదలవుతుంది. కొంత మంది వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి ఇలాంటి హత్యలు చేశారు అని తేలుతుంది. వ్యవస్థ మీద వారు యుద్ధం చేస్తున్నారు అని, ఆ క్రమంలోనే ఇలా చేస్తున్నారు అని తెలుస్తుంది. జోస్ (చెంబన్ వినోద్ జోస్) అనే ఒక పోలీస్ చీఫ్ చెప్పడంతో అమర్ (ఫహాద్ ఫాసిల్) నేతృత్వంలో ఉన్న ఫోర్స్ ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో అమర్ కర్ణన్ జీవితానికి సంబంధించిన విషయాలని తెలుసుకుంటూ ఉంటాడు. కానీ కర్ణన్ ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అమర్ తెలుసుకోలేకపోతాడు. మరొక పక్క సంతానం (విజయ్ సేతుపతి) ఎన్నో వ్యాపారాలు నడుపుతూ ఉంటాడు. అసలు కర్ణన్ ఎవరు? కర్ణన్ కి తన కొడుకు అంటే నిజంగానే ఇష్టమా? కర్ణన్ చనిపోయాడా? బతికే ఉన్నాడా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

kamal haasan vikram hitlist review

రివ్యూ :

ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారు అనగానే ఆసక్తి మొదలైంది. సాధారణంగా కమల్ హాసన్ సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. కమల్ హాసన్ ని ఒక మంచి యాక్షన్ రోల్ లో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. గత కొద్ది సంవత్సరాలుగా కమల్ హాసన్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. తనలో ఉన్న నటుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ లోని యాక్షన్ హీరో మరొకసారి బయటికి వచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అమర్ పాత్ర పోషించిన ఫహాద్ ఫాసిల్ పాత్రతోనే నడుస్తుంది.

kamal haasan vikram hitlist review

సినిమా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. నెక్స్ట్ ఏమౌతుంది అని ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. లోకేష్ కనకరాజ్ అంటే సాధారణంగా కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా గుర్తొస్తుంది. కానీ మధ్యలో మాస్టర్ సినిమాతో కమర్షియల్ సినిమా కూడా చేశారు. మళ్లీ విక్రమ్ సినిమాలో ఖైదీలో ఉన్నట్టుగానే చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. సినిమా ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, అనిరుధ్ అందించిన సంగీతం మరొక ఎత్తు. అలాగే సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. నిడివి ఇంకా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • యాక్షన్ సీన్స్
  • మ్యూజిక్
  • కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడా స్లోగా అనిపించే ఫస్ట్ హాఫ్
  • సినిమా నిడివి

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ సినిమా చూసిన ఫీల్ వస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని, అలాగే కమల్ హాసన్ ని చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పవర్ ఫుల్ రోల్ లో చూడాలి అనుకునే వారిని విక్రమ్ అస్సలు నిరాశ పరచదు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి స్టోరీ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది.


End of Article

You may also like