Ads
ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్-ఇండియన్ రేంజ్ లో పెరిగింది. అయితే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ ఫోటోపై వస్తున్న కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ ఫోటోలో కొంచెం వేరేగా, కాస్త లావు అయినట్టు కనిపిస్తున్నారు. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయిన తర్వాత అవి చూసిన నార్త్ ఇండియన్ నెటిజన్లలో కొంత మంది, “అల్లు అర్జున్ ఇలా కనిపిస్తున్నారు ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం, “బహుశా ఇది పుష్ప సినిమాకి సంబంధించి లుక్ అయ్యి ఉండొచ్చు” అని అంటున్నారు. కొంత మంది మాత్రం “క్రికెటర్ లసిత్ మలింగలాగా ఉన్నారు” అని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/CfLP91jNAz2/
End of Article