Ads
సెలబ్రిటీలు ఏం చేసినా సరే అవి చర్చల్లో నిలుస్తాయి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కచ్చితంగా వైరల్ అవుతుంది. వారు ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరినైనా కలిసినా, అసలు ఏం చేసినా కూడా అది బయటికి వచ్చేస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా వారికి సంబంధించిన చాలా విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్తూ ఉంటారు. ఇదే విధంగా ఇటీవల బాలీవుడ్ స్టార్ నటులు అయిన రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా వాళ్ల తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పారు.
Video Advertisement
వీరిద్దరి పెళ్లి కొన్ని నెలల క్రితం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ వార్త వైరల్ అవుతోంది. వీరితో పాటు ఇంకా కొంత మంది సెలబ్రిటీలు కూడా అలాగే పెళ్లయిన కొద్ది నెలలకే వారు తల్లిదండ్రులు అవుతున్నట్లు ప్రకటించారు. వారిలో చాలా మంది బాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలే ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
#1 దియా మీర్జా
ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ఫిబ్రవరి 2021 లో వైభవ్ రేఖీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే ఏప్రిల్ 2021 లో దియా మీర్జా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. వారికి ఒక బాబు పుట్టాడు.
#2 నేహా ధూపియా
నేహా ధూపియా బాలీవుడ్ నటి. అలాగే తెలుగులో కూడా నటించారు. నేహా ధూపియా 2018లో ప్రముఖ నటుడు అంగద్ బేడిని పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా పెళ్లి జరిగిన 4 నెలలకే వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
#3 కొంకణ సేన్ శర్మ
ప్రముఖ నటి కొంకణ సేన్ శర్మ కూడా 2010లో పెళ్లయిన కొద్ది నెలలకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు.
#4 శ్రీదేవి
ప్రముఖ నటి శ్రీదేవి కూడా పెళ్లయిన కొద్ది నెలలకే జాన్వీ కపూర్ కి జన్మనిచ్చారు. 1996 జూన్ లో వీరి పెళ్లి జరగగా, 1997 మార్చిలో జాన్వీ కపూర్ జన్మించారు.
#5 కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు కూడా పెళ్లయిన కొద్ది నెలల తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. 2021 అక్టోబర్ లో వీరి పెళ్లి జరగగా, 2021లో కాజల్ తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల వారికి బాబు పుట్టినట్టు, ఆ బాబు పేరు నీల్ అని పెట్టినట్టు చెప్పారు.
#6 ఆలియా భట్
ప్రముఖ నటి ఆలియా భట్, ప్రముఖ హీరో రణబీర్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
#7 ప్రణీత సుభాష్
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ 2021లో నితిన్ రాజుని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పాప పుట్టినట్టు సోషల్ మీడియా ద్వారా ఇటీవల ప్రకటించారు.
వీరితో పాటు బాలీవుడ్ సీరియల్ నటుడు షహీర్ షేక్, రుచిక కపూర్ కూడా పెళ్లయిన కొద్ది నెలలకే వారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వార్తలు ప్రకటించకుండా వారు తల్లిదండ్రులు అయ్యారు అని, వారి పిల్లలను పరిచయం చేస్తూ చెప్పారు.
End of Article