మీనా భర్త మృతికి “పావురాలు” కారణమా..? అసలేం జరిగిందంటే..?

మీనా భర్త మృతికి “పావురాలు” కారణమా..? అసలేం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

ప్రముఖ నటి మీనా భర్త విద్యా సాగర్ అస్వస్థత కారణంగా చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విద్యా సాగర్ గత కొంత కాలం నుండి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మీనా, విద్యా సాగర్ 2009లో పెళ్లి చేసుకున్నారు. విద్యాసాగర్ తెలుగు కుటుంబానికి చెందినవారు. విద్యా సాగర్ గత కొంత కాలం నుండి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు కారణం పావురాలు.

Video Advertisement

పావురాలు అక్కడ ఎక్కువగా విసర్జించడంతో ఆ గాలి వలన విద్యా సాగర్ కి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఈ సంవత్సరం మొదట్లో మీనాకి, విద్యా సాగర్ కి, వారి కూతురు నైనికకి కరోనా పాజిటివ్ వచ్చింది.

reason behind meena husband vidyasagar demise

చెన్నైలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యా సాగర్ చికిత్స పొందారు. ఆ ఆస్పత్రి వైద్యులు విద్యా సాగర్ కి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. విద్యా సాగర్ అంత్యక్రియలు ఇవాళ చెన్నైలో జరుగుతాయి. విద్యా సాగర్ మొదట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేసారు. తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. పెళ్లయిన తర్వాత కూడా మీనా చాలా సినిమాల్లో నటించారు.

reason behind meena husband vidyasagar demise

అందుకు విద్యా సాగర్ చాలా ప్రోత్సహించారు. ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలో మీనా నటించారు. ఇటీవలే వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 లో కూడా మీనా నటించారు. అలాగే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా మోహన్ బాబు పక్కన హీరోయిన్ గా నటించారు. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమాలో కూడా మీనా నటించారు. వారి కూతురు నైనిక కూడా ఒక సినిమాలో నటించారు.


End of Article

You may also like