Home Filmy Adda “నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను..!” అంటూ… వైరల్ అవుతున్న “అనసూయ” పోస్ట్..! దీని వెనుక అర్థం ఏంటి..?

“నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను..!” అంటూ… వైరల్ అవుతున్న “అనసూయ” పోస్ట్..! దీని వెనుక అర్థం ఏంటి..?

by Mohana Priya

టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు నటిగా కూడా రాణిస్తున్నారు అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా యాంకర్ గా చేస్తారు అనసూయ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

క్షణం, రంగస్థలం సినిమాల్లో అనసూయ పోషించిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా అనసూయ ఎన్నో సినిమాల్లో నటించారు.

ఇటీవల పుష్పలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు అనసూయ. సినిమా ఎండ్ అయిన విధానం చూస్తే పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా అనసూయ పాత్ర ఉంటుంది. అందులో అనసూయ పాత్ర ఒక ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. ఇటీవల అనసూయ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో అనసూయ ఈ విధంగా రాశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనసూయ, “నా కెరీర్ కి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. అది ఇవాళ అమలుపరిచాను”.

anasuya instagram story goes viral

అంతే కాకుండా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ, “ఎన్నో జ్ఞాపకాలను నేను నాతో తీసుకెళ్తున్నాను. ఇందులో కొన్ని మంచివి, కొన్ని బాధ కలిగించేవి, కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏముందో అనే దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పటిలాగానే మీరు కూడా నాతో ప్రయాణిస్తారు అని నేను ఆశిస్తున్నాను” అని రాశారు. చాలా మంది ఇది చూసి అనసూయ జబర్దస్త్ షో నుండి తప్పుకుంటున్నారు ఏమో అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అనసూయ టీవీ షోస్ తో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు.

You may also like