Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో బండ్ల గణేష్ ఒకరు. ఏ విషయం పైన సరే సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందిస్తారు. సెలెబ్రిటీలకి పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పడం మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక విషయాలపై కూడా బండ్ల గణేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తారు.
Video Advertisement
అయితే ఇటీవల బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొడుకు పుట్టారు అని తెలిసి అందరూ అభినందించారు. బండ్ల గణేష్ కూడా దిల్ రాజుకి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ లో వేరే ప్రొడ్యూసర్ ని ట్యాగ్ చేశారు.
దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని ట్యాగ్ చేసే బదులు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ సంస్థని ట్యాగ్ చేశారు. అలాగే ఈ విషయంపై అభినందనలు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే బండ్ల గణేష్ సినిమాల్లో నటించడం, మాత్రమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా నిర్మించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ నటిస్తున్న కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
End of Article