“అంటే ఇప్పుడు మా హీరో సినిమా పరిస్థితి కూడా ఇంతేనా..?” అంటూ… ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..! కారణమేంటంటే..?

“అంటే ఇప్పుడు మా హీరో సినిమా పరిస్థితి కూడా ఇంతేనా..?” అంటూ… ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..! కారణమేంటంటే..?

by Mohana Priya

Ads

గోపీచంద్ సినిమాలు అంటేనే సాధారణంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కథ కూడా అంతకు ముందు ఎక్కడా చూడనట్టుగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు అయినా సరే గోపీచంద్ స్టైల్ ప్రేక్షకులకి చాలా కొత్తగా అనిపిస్తుంది.

Video Advertisement

అందుకే గోపీచంద్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అది కూడా గోపీచంద్ మారుతి లాంటి డైరెక్టర్ తో సినిమా చూస్తున్నారు అనగానే పక్కా కమర్షియల్ సినిమాపై ఎప్పటినుంచో ప్రేక్షకులకి ఎలా ఉంటుందా అనే ఒక ఆసక్తి ఉంది. సాధారణంగా మారుతి సినిమా అంటే కామెడీ, కమర్షియల్ అంశాలు ఉంటాయి.

prabhas

ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. సినిమాలో చాలా వన్ లైనర్ డైలాగ్స్ ఉన్నాయి. చాలా వరకు అవి వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించాయి. అయితే ప్రస్తుతం సినిమాకి వస్తున్న స్పందన చూసిన తర్వాత ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అందుకు కారణం ప్రభాస్ నెక్స్ట్ సినిమా మారుతితో చేస్తున్నారు. రాజా డీలక్స్ అనే సినిమా కోసం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్నారు.

reason behind prabhas movies disappoing after bahubali

దాంతో ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుంది ఏమో అని అభిమానులు అనుకుంటున్నారు. అంతే కాకుండా ప్రభాస్ గత రెండు సినిమాలు కూడా యంగ్ డైరెక్టర్స్ తో తీశారు. అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా అయినా హిట్ అయితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రభాస్ సలార్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలకి సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


End of Article

You may also like