Home Filmy Adda “తప్పుడు సమాచారాన్ని అందించకండి..!” అంటూ… వైరల్ అవుతున్న నటి “మీనా” పోస్ట్..!

“తప్పుడు సమాచారాన్ని అందించకండి..!” అంటూ… వైరల్ అవుతున్న నటి “మీనా” పోస్ట్..!

by Mohana Priya

ప్రముఖ నటి మీనా భర్త విద్యా సాగర్ అస్వస్థత కారణంగా చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విద్యా సాగర్ గత కొంత కాలం నుండి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మీనా, విద్యా సాగర్ 2009లో పెళ్లి చేసుకున్నారు.

విద్యా సాగర్ తెలుగు కుటుంబానికి చెందినవారు. విద్యా సాగర్ గత కొంత కాలం నుండి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

meena recent post about her husband goes viral

ఇవాళ మీనా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ విషయానికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. అందులో మీనా, ” నా భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై నేను చాలా బాధపడుతున్నాను. ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితిని గౌరవించాలి అని నేను మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయంపై తెలిసీ తెలియకుండా తప్పుడు సమాచారాన్ని అందించకండి. ఇలాంటి సమయాల్లో నాకు నా కుటుంబానికి ధైర్యం చెప్పిన వాళ్లందరికీ నేను థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. నా భర్తని కాపాడటానికి ఎంతో ప్రయత్నించిన మెడికల్ టీంకి కూడా థాంక్స్ చెప్తున్నాను” అని రాశారు.

reason behind meena husband vidyasagar demise

విద్యా సాగర్ మొదట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేసారు. తర్వాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. పెళ్లయిన తర్వాత కూడా మీనా చాలా సినిమాల్లో  నటించారు. ఇటీవలే వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 లో కూడా మీనా నటించారు. అలాగే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా మోహన్ బాబు పక్కన హీరోయిన్ గా నటించారు. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమాలో కూడా మీనా నటించారు. వారి కూతురు నైనిక కూడా ఒక సినిమాలో నటించారు.

You may also like