Ads
సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకి సినిమాల్లో హీరోయిన్‌గా నటించే కాలం తక్కువగా ఉంటుంది అని అంటారు. చాలా వరకు అది నిజమే. అప్పట్లో హీరోలుగా నటించిన ఎంతో మంది హీరోలు ఇప్పటికి కూడా హీరోలుగా నటిస్తున్నారు. కానీ అప్పుడు హీరోయిన్లుగా నటించిన చాలా మంది హీరోయిన్లు మాత్రం ఇప్పుడు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Video Advertisement
అప్పట్లో హీరోయిన్లుగా నటించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న చాలా మంది, తర్వాత కొంత కాలానికి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు. మళ్లీ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు.
ఇప్పుడు కూడా కొంత మంది అప్పటి హీరోయిన్లు మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. మరికొంతమంది హీరోయిన్లు ఇటీవల కంబ్యాక్ ఇచ్చారు. నిరీక్షణ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు అర్చన. అర్చన మొదటి నుండి కూడా కేవలం పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేశారు. అందుకే అర్చన చేసింది కొన్ని సినిమాలు అయినా సరే ప్రేక్షకులకి గుర్తుండిపోయారు.
అర్చన ఇటీవల ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అర్చన ఈ సినిమాలో నటిస్తున్నారు అనగానే మళ్లీ ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత అర్చన పాత్రకి ప్రాధాన్యత ఇంకా కొంచెం ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేదేమో అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఏదేమైనా ఈ సినిమా తర్వాత అర్చన తెలుగులో మళ్లీ నటిస్తారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article