Home Filmy Adda “అదేంటి అలా అన్నారు..? ఇంత చిన్న విషయం కూడా తెలియదా..?” అంటూ… కళ్యాణ్ రామ్ పై నెటిజన్స్ కామెంట్స్..!

“అదేంటి అలా అన్నారు..? ఇంత చిన్న విషయం కూడా తెలియదా..?” అంటూ… కళ్యాణ్ రామ్ పై నెటిజన్స్ కామెంట్స్..!

by Mohana Priya

బాల నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఎంచుకునే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక సినిమాకి ఒక సినిమాకి పోలిక ఉండదు. ఆ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కూడా చాలా కష్టపడతారు.

ప్రతి సినిమాకి ఆ కథకి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటారు. ఇప్పుడు కూడా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న బింబిసార సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ ఇలాంటి పాత్రలు చేయలేదు. సినిమా ట్రైలర్, అంతే కాకుండా సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ చూస్తే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని అర్థమైపోతోంది. దాంతో ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ గత కొద్ది సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డారు.

netizens comments on kalyan ram during bimbisara trailer launch goes viral

తన భాషలో కానీ గెటప్ లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా, అలాగే చిన్నచిన్న వాటిపై కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల కళ్యాణ్ రామ్ మాట్లాడిన ఒక విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

netizens comments on kalyan ram during bimbisara trailer launch goes viral

అయితే ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “ఈ సినిమాని పూర్తి పౌరాణిక సినిమాగా చేద్దామని అనుకున్నామని, కానీ బాహుబలి వచ్చింది” అని అన్నారు. కానీ బాహుబలి అనేది పౌరాణిక సినిమా కాదు. బాహుబలి అనేది ఒక జానపద సినిమా. దాంతో ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు, “బాహుబలి అనేది ఒక జానపద సినిమా అని అందరికీ తెలుసు. మరి ఇలా ఎలా అన్నారు?” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంక బింబిసార సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

You may also like