Ads
ప్రముఖ నటుడు విక్రమ్ ఇవాళ గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ ఇవాళ సాయంత్రం విడుదల అవుతోంది. ఈ ఈవెంట్ కి సినిమా బృందంతో పాటు, సినిమా టీజర్ ని వాళ్ల భాషల్లో విడుదల చేస్తున్న సూర్య, మహేష్ బాబు, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్, రక్షిత్ శెట్టి కూడా అతిథులుగా హాజరవుతారని సమాచారం.
Video Advertisement
ఇలాంటి సమయంలో విక్రమ్ కి గుండెపోటు రావడం అనేది తమిళ సినీ ప్రేక్షకులను ఆందోళనకి గురి చేసింది. ఇండియా టుడే కథనం ప్రకారం, గురువారం రోజు విక్రమ్ కి ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది. దాంతో విక్రమ్ ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ విక్రమ్ ని నార్మల్ వార్డ్ కి తరలించారు. ఇవాళ తర్వాత విక్రమ్ ని డిశ్చార్జ్ చేస్తారు.
ఈ విషయంపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ చాలా మంది సెలబ్రిటీలు అలాగే విక్రమ్ అభిమానులు విక్రమ్ త్వరగా కోలుకోవాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే విక్రమ్ ఆస్పత్రిలో జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు అని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. విక్రమ్ హీరోగా నటించిన పొన్నియన్ సెల్వన్ టీజర్ ఇవాళ విడుదల అవుతుంది. బహుశా ఈ ఈవెంట్ కి విక్రమ్ వచ్చే అవకాశాలు లేదు. అలాగే విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సోమవారం నాడు ఉంది. అప్పటికి విక్రమ్ మళ్లీ మామూలుగా ఈ ఈవెంట్ కి హాజరు అవుతారు అని అంటున్నారు.
End of Article