Ads
వెంకటేష్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కామెడీ టైమింగ్. గత కొద్ది సంవత్సరాల నుండి వెంకటేష్ ఎన్నో రకాల సినిమాలని చేస్తున్నారు. కానీ వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సినిమా మాత్రం ఎఫ్ 2. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని ప్రకటించిన తర్వాత చాలామంది అది ఎలా ఉండబోతోంది అని ఎదురు చూశారు. ఎఫ్ 2 సీక్వెల్ అయిన ఎఫ్ 3 కూడా విడుదల అయ్యింది. ఇది మొదటి భాగానికి కొనసాగింపు కాదు. వేరే స్టోరీతో సినిమా నడుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకీ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. అందులోనూ ఈ సినిమాలో ఉన్న కామెడీ గురించి చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఇంత నెగటివ్ కామెంట్స్ మధ్యలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సోనిలివ్ తో పాటు నెట్ఫ్లిక్స్లో కూడా జులై 22వ తేదీన రిలీజ్ అవుతుంది. సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో ఓటీటీలో కొంచెం ఆలస్యంగా విడుదల అవుతోంది. అంతే కాకుండా సినిమా విడుదల సమయంలోనే సినిమా బృందం అప్పుడే ఓటీటీలో విడుదల అవ్వదు అని, థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత దాదాపు రెండు నెలలకి ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు.
End of Article