Home Filmy Adda “ట్రైలర్ అని చెప్పి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ విజయ్ దేవరకొండ “లైగర్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

“ట్రైలర్ అని చెప్పి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ విజయ్ దేవరకొండ “లైగర్” ట్రైలర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాలవల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట కూడా వినిపిస్తోంది. ట్రైలర్ మొత్తం ఈ పాట వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యాయి.

Trending memes on vijay devarakonda liger trailer

ఇప్పుడు ఈ సినిమా ఈ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అవుతోంది. ఇంకా కొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఈ సినిమా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు అని అర్థమవుతోంది.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి నత్తి అని కూడా తెలుస్తోంది.  సినిమా అంత ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2
#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like