Ads
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మహిళ మిస్సింగ్ కేసులో కొత్త విషయం బయటికి వచ్చింది. సాయి ప్రియ అనే ఆ మహిళ నెల్లూరులో ఉన్నట్టు వారి బంధువులు గుర్తించారు. సాయి ప్రియ నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. పెళ్లిరోజు భర్త శ్రీనివాస్ తో కలిసి ఆర్కే బీచ్ కి వెళ్లారు.
Video Advertisement
శ్రీనివాస్ మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు సాయి ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో ఆమె సముద్రంలో గల్లంతు అయినట్టు అందరూ అనుకున్నారు. సాయి ప్రియ ఎక్కడ ఉందో కనిపించకపోవడంతో ఆమె కోసం నేవీ హెలికాప్టర్ తో ఆమెను వెతకడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు బయటికి వచ్చిన విషయం ఏంటి అంటే సాయి ప్రియ నెల్లూరులో తన ప్రియుడితో ఉన్నారు.
వైజాగ్ లోని ఎన్ఎడి సమీపంలోని సంజీవయ్య నగర్ కి చెందిన సాయి ప్రియకి 2 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో పెళ్లి జరిగింది. సాయి ప్రియ సంజీవయ్య నగర్ లో ఉంటారు. శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో వాళ్ళిద్దరూ ఆర్కే బీచ్ కి వెళ్లారు. 7:30 సమయంలో వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు శ్రీనివాసరావుకి ఫోన్ వచ్చి పక్కకి వెళ్లి మాట్లాడారు.
తిరిగి వచ్చేలోపు సాయి ప్రియ కనిపించలేదు. వెంటనే శ్రీనివాస్ సాయి ప్రియ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. ఆమె సముద్రంలో గల్లంతయ్యి ఉండొచ్చు అని వాళ్ళు అందరూ అనుకున్నారు. మంగళవారం ఉదయం నుండి స్పీడ్ బోట్స్, నేవీ హెలికాప్టర్ల సహాయంతో సాయి ప్రియ కోసం గాలించారు. కానీ సాయి ప్రియ కనిపించలేదు. అసలు ఆమె సముద్రంలోనే గల్లంతయ్యిందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు చూస్తే సాయి ప్రియ నెల్లూరులో ఉన్నారు అని తెలిసింది.
End of Article