Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు. వారిలో చాలా మందికి గుర్తింపు దక్కుతుంది. కొంత మందికి మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తింపు తగ్గుతుంది. దాంతో వాళ్లు ఆ సినిమాతో చాలా ఫేమస్ అయిపోతారు.
Video Advertisement
తర్వాత వాళ్లను ఎక్కడ చూసినా కూడా మొదటిగా వాళ్ళు ఏ సినిమా అయితే ఫేమస్ అయ్యారో అదే సినిమా గుర్తొస్తుంది. అలా సడన్ గా కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన నటి హెబ్బా పటేల్. అలా ఎలా అనే ఒక సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హెబ్బా పటేల్.
ఆ సినిమా అంత పెద్ద గుర్తింపు తీసుకురాకపోయినా కూడా తర్వాత నటించిన కుమారి 21ఎఫ్ సినిమాతో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిపోయారు. అందులో ఆమె నటన, డైలాగ్స్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత హెబ్బా పటేల్ చాలా సినిమాల్లో నటించారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మిస్టర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కానీ వాటిలో ఆమె పాత్రలకి మళ్లీ కుమారి 21 ఎఫ్ సినిమాలో లభించిన గుర్తింపు లభించలేదు ఏమో అనిపిస్తుంది.
హెబ్బా పటేల్ భీష్మ సినిమాలో కూడా ఒక పాత్ర పోషించారు. ఆ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొంతకాలం క్రితం విడుదల అయ్యింది. అయితే హెబ్బా పటేల్ రీసెంట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హెబ్బా పటేల్ పూర్తిగా మారిపోయి ఉన్నారు. సడన్ గా చూస్తే అసలు హెబ్బా పటేల్ లాగా అనిపించట్లేదు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
End of Article