30 సంవత్సరాల కిందట మరణం..! ఇప్పుడు పెళ్లి..? అసలు ఏం జరిగిందంటే..?

30 సంవత్సరాల కిందట మరణం..! ఇప్పుడు పెళ్లి..? అసలు ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చ లో నిలిచింది. వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లా సంప్రదాయం ప్రకారం ఇద్దరు వ్యక్తులకి ఇప్పుడు వివాహం జరిగింది. మరొక విషయం ఏమిటంటే సాధారణంగా బతికి ఉన్న మనుషులకి ఎలాగైతే పెళ్లి చేస్తారో అలాగే ఈ పెళ్లి కూడా జరిగింది. ఈ విషయాన్ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Video Advertisement

ఆ నెటిజన్ ట్వీట్ చేస్తూ ఈ విధంగా చెప్పారు, ” నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఇది సాధారణంగా మనం ఎప్పుడూ చూసే పెళ్లిలాగానే జరిగి ఉంటే నేను ఇప్పుడు మాట్లాడే వాడిని కాదు. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇద్దరు 30 సంవత్సరాల క్రితం మరణించారు. వారికి ఇప్పుడు పెళ్లి జరిగింది. దక్షిణ కన్నడ సాంప్రదాయం గురించి పెద్దగా తెలియని వారికి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. ఇది వింటే కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది. కానీ ఇది నిజం.”

bengaluru marriage

“ప్రసవ సమయంలో మరణించిన ఒక బిడ్డకి, అలాగే ప్రసవ సమయంలో మరణించిన మరొక బిడ్డకి పెళ్లి చేస్తారు. మొదట రెండు కుటుంబాలకి చెందిన సభ్యులు కలుసుకొని ఎంగేజ్మెంట్ చేస్తారు. మామూలుగా పెళ్లిళ్లకి ఎలాగైతే పద్దతులు పాటిస్తారో అలాగే వీరు కూడా పాటిస్తారు. మొదట అబ్బాయి తెచ్చిన చీరని పెళ్లి కూతురు ధరించాలి. ఆమె సిద్ధం అవ్వడానికి కొంత సమయం ఇచ్చారు. తర్వాత వాళ్ళు పెళ్లి పీటల మీద కూర్చునే ముందు ఏడడుగులు నడుస్తారు. తర్వాత తాళి కట్టడం అందరి ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి.”

bengaluru marriage

“మరణించిన వారికే కదా సులభంగా పెళ్ళి చేసేయొచ్చు అని అనుకుంటే అది పొరపాటే. ఇక్కడ కూడా వారికి పెళ్లి చేసే ముందు అన్ని వివరాలను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న పెళ్ళికొడుకు కుటుంబం ఒక సంబంధంలో ఆ అమ్మాయి వయసు ఎక్కువ ఉంది అని తిరస్కరించారు. ఈ సంప్రదాయాలు అన్ని కూడా చూడడానికి అందంగా ఉంటాయి. తమ బిడ్డలు లేకపోయినా కూడా వారి పెద్దలు వారి పెళ్లిని చాలా ఘనంగా జరిపించారు. అందరికీ మంచి వంటలు కూడా వడ్డించారు” అని రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like