Home Filmy Adda “నందమూరి బాలకృష్ణ”తో పాటు… తోడబుట్టిన చెల్లెళ్లని కోల్పోయిన 3 స్టార్ హీరోస్..!

“నందమూరి బాలకృష్ణ”తో పాటు… తోడబుట్టిన చెల్లెళ్లని కోల్పోయిన 3 స్టార్ హీరోస్..!

by Mohana Priya

వరుస విషాదాలతో మునిగి తేలుతున్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది. ఇదిలా ఉండగా మన తారలు ఎందరో తమ తోబుట్టువులకు అశ్రునివాళి పలికారు.

తమతో పుట్టి ,తమతో పెరిగి, జీవితంలోని కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ పంచుకున్న తోబుట్టువులు తమ కళ్ళముందే చనిపోవడం ఎవరికైనా బాధాకరం. అలా తమ చెల్లెళ్లని కోల్పోయి దుఃఖిస్తున్న ఆ సినీ దిగ్గజాలు ఎవరో చూద్దామా..

#1 విజయ్

హీరో విజయ్ తమిళ్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఫ్యామిలీ సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇచ్చే హీరో స్కూల్ డేస్ లోనే అనారోగ్య పరిస్థితి వల్ల తన చెల్లెల్ని కోల్పోయారు. ఇప్పటికీ ఆమెను ఎన్నో సందర్భాలలో ఆమెను తలచుకొని ఎమోషనల్ అవుతుంటాడు ఈ స్టార్ హీరో.

#2 అక్కినేని నాగార్జున

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో సుపరిచితమైన హీరోగా పేరు పొందిన నాగార్జున, తన సోదరి సత్యవతిని కోల్పోయారు. ఆమె కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరణించారు. సత్యవతి పిల్లలైన సుమంత్ ,సుప్రియ ఇద్దరు ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు.

Akkineni Nagarjuna

#3 నందమూరి బాలకృష్ణ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి వంశం గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ సోదరి అయిన ఉమామహేశ్వరి ఈ మధ్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరికీ తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తీవ్ర డిప్రెషన్ కి గురైన ఉమామహేశ్వరి తన స్వగృహం నందు ఉరిపోసుకొని చనిపోయారు. ఈ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

movies in which balakrishna acted in dual roles

You may also like