Home Filmy Adda ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో… “సాయి పల్లవి” సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిందిగా..?

ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో… “సాయి పల్లవి” సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిందిగా..?

by Mohana Priya

అందరికీ భిన్నంగా, తన స్వభావానికి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యడం సాయి పల్లవి నైజం. నటనలోనూ, నాత్యంలోను, పెద్ద హీరోలతో పోలిస్తే దేనికి తీసిపోదు. తను ఎంచుకునే కథలతోనే అందరి మనసులు దొచేస్తోంది.

ఈ తరహాలోనే తాజాగా తను నటించింన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. విరాట పర్వంతో మరింత చేరువ అవ్వగా… జూలై 15 న విడుదలైన గార్గితో వరుస హిట్ లను తన కాతాలో వేసుకుంది.

Sai pallavi silently scored a hit with gargi

అయితే జూలై నెలలో, ఎంతో మంది పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో హిట్ ఇవ్వలేక పోయాయి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి, గార్గితో ఎలాంటి హంగామా లేకుండానే హిట్ కొట్టడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సైలెంట్ గా వర్క్ చేసి, సక్సెస్ తో సౌండ్ చెయ్యడం అంటే ఇదేనేమో. దీంతో పెద్ద హీరోలకి సైతం ధీటుగా నిలిచి సాయి పల్లవి సైలెంట్ కిల్లర్ అనిపించుకుంది.

Sai pallavi silently scored a hit with gargi 1

ఇక ఈ సినిమా నిర్మించడానికి అయిన పూర్తి బడ్జెట్ 5 కోట్లు అయితే… 14 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా ఓటీటీ ప్లాట్ఫారంలో… అన్ని భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్లకు అమ్ముడుపోవడంతో, నిర్మాతలకి మంచి లాభం చేకూరింది. కాగా గార్గి సినిమాకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. బ్లాకీ,జెని తో పాటు మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినిమాని చిత్రీకరించారు.

You may also like