Home Filmy Adda విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్. ఈ సినిమాతో అనన్య పాండే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.

సినిమా గురించి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి సినిమాపై క్రేజ్ మొదలైంది. ఇది విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండలాంటి నటుడి సినిమా పాన్ ఇండియన్ సినిమాగా వస్తోంది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 25న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లైగర్ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

minus points in vijay devarakonda liger trailer

ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమయింది. ఈ చిత్రం మొత్తం పూర్తవడానికి పట్టే సమయం 140 నిమిషాలు మరియు దీనికి U/A సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ప్రియులకు మంచి వినోదాన్ని ఇచ్చే విధంగా రూపొందించబడింది. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం పూర్తి మేకోవర్ అయిన విజయ్ తన కొత్త లుక్స్ తో ట్రెండింగ్ గా మారాడు. ఈ చిత్రంలో విజయ్ ఫైటింగ్ సీన్స్ లో భారీ విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు. విజయ్-అనన్య పాండే మధ్య సాగే లవ్ ట్రాక్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

minus points in vijay devarakonda liger trailer

బాక్సింగ్ లెజెండరీ ఫిగర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా పూరి జగన్నాధ్ రూపొందించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే సందడి స్టార్ట్ చేసింది. ఈ మూవీలోని తల్లి కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకుల మనసును కదిలిస్తుంది. క్లైమాక్స్‌ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందీ అని అంచనా. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హైప్ మరియు పాజిటివ్ సెన్సార్ టాక్ ప్రకారం లైగర్ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అందరి అంచనా.

You may also like