సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా తీసినా, మధ్య మధ్యలో ఫ్యామిలీతో ట్రిప్స్ బాగా ఎంజాయి చేస్తుంటారు. కుటుంబంతో సమయం గడపడానికి ఆయన బాగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఫ్యామిలీతో వెళ్లిన యూరోప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చారు. ఇక అలా వచ్చారో లేదో వెంటనే పనిలో పడ్డారు. అంతే కాకుండా తదుపరి నటించబోయే సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ssmb 28 గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… “నేను త్రివిక్రమ్ ఎప్పుడు కలిసినా వాతావరణం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అసలు ఇప్పటి వరకూ ఉన్న ప్రముఖ డైలాగ్ రైటర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఆయన రాసిన ప్రతీ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఆయన దర్శకత్వంలో నటులకి ఎటువంటి ఒత్తిడి ఉండదు. డైలాగ్స్ రాస్తే సహజత్వం ఉట్టిపడుతుంది” అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

ఇక ssmb28 గురించి ఎవ్వరూ ఊహించలేరని, గతంలో తాము ఇద్దరు కలిసి చేసిన సినిమాల కంటే కూడా.. ఒక వినూత్నమైన కథతో ముందుకు వస్తున్నామన్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో! ప్రేక్షకుల ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందో! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సూపర్ స్టార్ మహేష్ అన్నారు.
