Home Filmy Adda “మీరు చేస్తే కరెక్ట్… ఇంకొకరు చేస్తే మాత్రం తప్పా..?” అంటూ… “సమంత” పై నెటిజెన్స్ కామెంట్స్..!

“మీరు చేస్తే కరెక్ట్… ఇంకొకరు చేస్తే మాత్రం తప్పా..?” అంటూ… “సమంత” పై నెటిజెన్స్ కామెంట్స్..!

by Mohana Priya

కుర్రాళ్ళ మనసులు దోచుకుంటూ… క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ… మొదటి సినిమాతోనే అందరికీ చేరువ అయ్యింది సమంత రూత్ ప్రభు. తను ఏమి చేసినా సెన్సేషన్ అవుతుంది. తనకి ఎవరైనా వ్యతిరేకంగా వెళితే నెట్టిల్లు ట్రోల్స్ తో వేడెక్కుతుంది. అంతే కాదు సమంత, నాగ చైతన్య జంటపై అభిమానులకి ఎంతో మక్కువ ఏర్పడింది. కానీ వాళ్ళ విడాకులతో అభిమానులకు చాలా బాధ కలిగింది.

అయితే కాఫీ విత్ కరణ్ లో నాగ చైతన్య తన ఎక్స్ హస్బెండ్ అంటూ సమంత చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. ఇది మర్చిపోయే లోపే…గతంలో సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ పై కామెంట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

video of samantha comments from koffee with karan show going viral

ఆ వీడియోలో నవ్వు ఆపుకుంటూ… “ఇది చెప్తే అందరూ నన్ను చెంపెస్తారేమో కాని, నాకు హృతిక్ రోషన్ లుక్స్ అంతగా నచ్చవు” అని ఒక్కసారిగా నవ్వేసింది. దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసినా చాలా మంది, “తన ఇష్టం, తన ఒపీనియన్ అది. అందులో తప్పేంటి?” అని అన్నారు. మరో వైపు పూజ హెగ్డే ఒకరోజు తన ఇన్స్టాగ్రామ్ లో, మజిలీ మూవీలోని సమంత ఫొటో పెట్టి, “తన లుక్స్ కూడా అంత ఏమి బాలేదు” అని స్టోరీ పెట్టింది. దీంతో సమంత అభిమానులు పూజ హెగ్డేను ట్రోల్స్ తో నింపేశారు.

ఇక తాజాగా బయటకి వచ్చిన సమంత పాత ఇంటర్వ్యూ వీడియో చూసి… ఇప్పుడు నెటిజన్స్ మాత్రం, “తను అలా అనొచ్చా” అంటూ మండిపడుతున్నారు. ఇలా సమంత ప్రతీ సారి ఏదో ఒక హాట్ టాపిక్స్ తో నెట్టింట తిరుగుతూనే ఉంది. కానీ ఇవన్నీ సమంతాకు పెద్దగా అవసరం లేనట్టు వ్యవహరిస్తుంది. ఇప్పుడు తన కెరీర్ బేస్ ను మరింత విస్తృతపరుచుకుంటుంది. పుష్ప మూవీలో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా పాటతో అందరినీ వేడెక్కించింది. అంతే కాకుండా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ వైపు దూసుకెళుతోంది. ఈ మేరకు సమంత ఫుల్ బిజీగా తన కెరీర్ ఇంక తన వృత్తిపై దృష్టితో పయనిస్తోంది.

watch video :

Samantha about Hrithik in 2010 🤣😅
byu/Illustrious-Check-76 inBollyBlindsNGossip

You may also like