Home Filmy Adda “సీతా రామం” సినిమాలో ఇది గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

“సీతా రామం” సినిమాలో ఇది గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

by Mohana Priya

2022 జూలైలో ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ… ఆగస్ట్ లో విడుదలైన సీతా రామం మూవీపై మంచి స్పందన లభించింది. ఇతర పెద్ద హీరోల సినిమాలు కూడా అంచనాలను చేరుకోలేక పోయాయి. కానీ సీతా రామం హిట్ కొడుతూ, మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సమయంలో… కొన్ని సంచలన నిజాలు బయటకి వచ్చాయి.

సినిమా అంతా బాగున్నా, డైరెక్టర్ చేసినా ఆ తప్పుల వల్ల, అంతా తలకిందులు అయ్యింది. మరి దీనికి డైరెక్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో అనేదానిపై చర్చలు కొనసాగుతున్నాయి.

sita ramam movie review

అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ గా తెరకెక్కిన సీతా రామం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సినిమా తీసిన విధానం, కథ, అందులోని నటుల నటన అన్నీ బాగున్నాయి. కానీ సినిమాకి ముఖ్య ఆధారం ప్రేమ లేఖ. అసలు కథ మొత్తం నడిచేది దాని చుట్టూనే. మరి ఆ లేఖ విషయంలోనే, దర్శకుడు అంత పెద్ద తప్పు చేశాడు ఏంటి అని ప్రేక్షకులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

sita ramam movie review

20 ఏళ్ల క్రితం రామ్ సీతకు రాసిన లేఖ ఏ విధంగా చేరిందనే దానిపై ఈ కథ నడుస్తోంది. ఇదిలా ఉంటే సీత ఒరిజినల్ నేమ్ నూర్జహాన్ అని రామ్ కి తెలుసు. అయినా కూడా సీతా మహాలక్ష్మి పేరుతో లేఖ రాస్తే, అది హీరోయిన్ కి చేరదని తెలిసి కూడా అదే పేరు ఎందుకు రాశాడని వీక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద తప్పుని డైరెక్టర్ ఎలా సమర్థిస్తారో చుడాలంటున్నారు. పోనీ లేఖ చివరిలో అయినా రెండు పేర్లు రాసి ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

sita ramam movie review

ఈ తప్పు లేకపోయి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని అంటున్నారు. దీనికి తోడు ఒకవైపు బింబిసారకు మంచి టాక్ ఉండటం, ఈ సినిమాలో లేఖ విషయంలో చిన్న పొరపాటు జరగటం, సీతా రామం కి కొంత మైనస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సినిమా విజయ బాటలో నడుస్తోంది. వీకెండ్ కలెక్షన్స్ సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.

You may also like