Ads
నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యు సినిమా ఇటీవల విడుదల అయ్యింది. సినిమా నిడివి చాలా తక్కువ. దాదాపు 2 గంటల 9 నిమిషాలు ఉంటుంది. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అంటే మంచి ఫీల్ గుడ్ సినిమాలు చాలా బాగా హ్యాండిల్ చేయగలరు అని పేరు ఉంది. అందులోనూ నాగ చైతన్యతో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Video Advertisement
సినిమా మొత్తాన్ని నాగ చైతన్య తన భుజాలపై నడిపించారు అని చెప్పాలి. గత కొన్ని సినిమాల నుండి నాగ చైతన్య నటనలో కూడా చాలా పరిణితి కనిపిస్తుంది. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా అంత పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
నాగ చైతన్య అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలరాజు పాత్రలో నాగ చైతన్య నటించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. నాగ చైతన్య ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. వివిధ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడిన ఒక కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగ చైతన్య తన చేతిపై తన పెళ్లి రోజును టాటు వేయించుకున్నారు. “ఈ టాటూ లో ఉన్న ఏంటి..? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే నాగ చైతన్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ఈ విషయంపై నాగ చైతన్య మాట్లాడుతూ, “సమంతతో పెళ్లి జరిగిన తేదీని పచ్చ బొట్టు వేయించుకున్నాను. అది డేట్ అని తెలియక చాలా మంది అభిమానులు ఇలాంటి పచ్చబొట్టు వేయించుకోవాలి అనుకుంటున్నారు. దయచేసి అలాంటివి చెయ్యవద్దు. ఈ విషయంలో నన్ను ఫాలో అవ్వకండి. ఈ టాటూ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే ఆ టాటూ అలానే ఉంచుకున్నాను” అని చెప్పారు. ప్రస్తుతం నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేశారు. దీనికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు.
watch video :
#NagaChaitanya revealed a fact about the tattoo which is on his arm. pic.twitter.com/KFrc7z4NY6
— Tollywood News Raja (@TollywoodTNR) August 10, 2022
End of Article