IAS పేరుతో అందరికీ మెసేజ్ చేశాడు..! కానీ చివరికి..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..!

IAS పేరుతో అందరికీ మెసేజ్ చేశాడు..! కానీ చివరికి..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..!

by Mohana Priya

Ads

సైబర్ నేరగాళ్ల ఆటలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాల క్రమేణా సాంకేతికంగా దేశం అభివృద్ధి చేదున్నప్పటికీ… సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువగా పెరుగుతున్నాయి. గిఫ్ట్ వచ్చిందనే సాకుతో లింకులు పంపు. ఉద్యోగం ఇస్తాం అంటూ, లాటరీ డబ్బులు అంటూ ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ, సైబర్ నేరాల ఉచ్చులో పడేస్తున్నారు.

Video Advertisement

దీనికి హద్దు పద్దులు లేకుండా పోయాయి. ఎవరిని మోసం చేస్తున్నాము అనే ఆలోచన కూడా ఉండట్లేదు. దీనిపై ప్రభుత్వం ఎన్ని లీగల్ యక్షన్స్ తీసుకున్నప్పటికీ… వీటిని అరిక్కట్ట లేకపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త పన్నాగంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ పేరుతో వల వేశారు.

whatsapp chat on the name of ias officer tina dabi

అయితే యంగ్ ఏజ్ లోనే ఐఏఎస్ అధికారి అయిన టీనా దాబి, తన తోటి ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఒక సైబర్ నేరగాడు ఆఫీసర్ టీనా దాబి పేరుతో, తన ఫోటోనే వాట్స్ ఆప్ కి డీపీగా పెట్టుకుని అందరినీ మోసం చెయ్యడం మొదలు పెట్టాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కు సంబంధించి, గిఫ్ట్ కార్డులు పంపాలంటూ మేసేజులు పెట్టేవాడు. అందులో కొందరు నిజంగా ఆఫీసర్ టీనానే ఆ మేసెజులు పంపి ఉంటారు అనుకుని, వాటికి స్పందించేవారు.

whatsapp chat on the name of ias officer tina dabi

ఇది చూసి తన ఆటలు బాగానే కొనసాతున్నాయని బ్రమ పడ్డాడు, ఆ సైబర్ నేరస్థుడు. అలానే ఒకరోజు తను పంపుతున్న అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మేసీజు అర్బ‌న్ ఇంప్రూవ్‌మెంట్ ట్ర‌స్టు సెక్ర‌ట‌రీ సునితా చౌద‌రీకి కూడా చేరింది. అక్కడే ఆ నేరస్థుడి ప్లాన్ బెడిసికొట్టింది. సెక్ర‌ట‌రీ సునితా చౌద‌రీకి అనుమానం రావడంతో, ఎందుకైనా మంచిది అని టీనాకు ఫోన్ చేశారు. దీంతో ఆఫీసర్ టీనా పసిగట్టి, వివరాలను సైబర్ పోలీసులు శోధించి విషయాన్ని చేదించారు. అక్కడితో నేరస్థుడు గుట్టు రట్టయింది. ఇదంతా రాజ‌స్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన ఓ యువ‌కుడు చేసిన పని అని తేలింది. ఇలా ఇంత పవర్ ఉన్న ఐఏఎస్ లకు కూడా రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటి అని నెటిజన్లు వాపోతున్నారు.


End of Article

You may also like