Home Filmy Adda విజయ్ దేవరకొండ “తల్లి” కూడా సినిమాల్లో నటించారా..? ఏ సినిమాలో అంటే..?

విజయ్ దేవరకొండ “తల్లి” కూడా సినిమాల్లో నటించారా..? ఏ సినిమాలో అంటే..?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాలవల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఇంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతోపాటు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా.

movie in which vijay devarakonda mother acted in a role

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాల్లో నటించారు. ఇప్పుడు హైవే అనే సినిమాలో కూడా నటించారు. అయితే విజయ్ దేవరకొండ తల్లి కూడా ఒక సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. అది కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమాలోనే కనిపించారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు.

movie in which vijay devarakonda mother acted in a role

సినిమా మొదట్లో హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ కి లేట్ అయిపోతుంది అంటూ తొందరగా కాలేజ్ కి వెళ్లి క్లాస్ లో కూర్చుంటారు. అప్పటికే క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. లెక్చరర్ పాఠం చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడ పాఠం చెప్పే లెక్చరర్ గా విజయ్ దేవరకొండ తల్లి కనిపిస్తారు. సినిమా చూసినప్పుడు ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఈ ఒక్క సీన్ లో విజయ్ దేవరకొండ తల్లి కనిపిస్తారు.

You may also like