Home Filmy Adda ఇదేంటి..? “సమంత” SSC మార్క్‌షీట్‌లో… ఇన్ని పొరపాట్లు ఉన్నాయా..?

ఇదేంటి..? “సమంత” SSC మార్క్‌షీట్‌లో… ఇన్ని పొరపాట్లు ఉన్నాయా..?

by Sainath Gopi

Ads

సమంత రూత్ ప్రభు 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో టాపర్‌గా నిలిచిన నటి ఇప్పుడు సినిమాల్లో కూడా టాపర్‌గా నిలిచిందని అభిమానులు కొనియాడుతున్నారు.

Video Advertisement

రిపోర్ట్ కార్డ్‌లో, ఆమె ఇంగ్లీష్ Iలో 90 మార్కులు మరియు ఇంగ్లీష్ II లో 74 మార్కులు సాధించినట్లు పేర్కొంది. గణితంలో, ఆమె ఖచ్చితమైన స్కోరు 100 మరియు ఫిజిక్స్‌లో 90 కంటే ఎక్కువ స్కోర్ చేసింది అలాగే హిస్టరీ లో 91 మార్కులు కూడా సాధించింది.కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మార్క్ షీట్ లో ఉన్న మార్కులు చాలా వరకు తప్పుగా వేయబడినవి అని అర్థమవుతుంది. ఆ మార్క్ షీట్ లో 50 మార్కులు కు జరిగిన ఫిజిక్స్ ఎగ్జామ్ లో 95 మరియు బోటనీ లో 84 మార్కులు సమంతకు ఆమె టీచర్లు ఎలా వేశారో వాళ్ళకే తెలియాలి.

netizens points out mistakes in samantha ssc marksheet

పోనీ ఇది సమంత ను డిఫేం చేయడానికి ఎవరో రిలీజ్ చేసిన ఫేక్ మార్క్ షీట్ అనుకుందామనుకున్నా దానికి ఆస్కారం లేదు ఎందుకంటే…సమంత స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో దీని గురించి మెన్షన్ చేయడం వల్ల ఇది కచ్చితంగా సమంతకు తెలిసే జరిగింది అని నిర్ధారణ అవుతుంది. ఈ విషయం ఐడెంటిఫై చేసి కొందరు నెటిజన్స్ 50 కి 84 ఎలా వచ్చాయి అంటూ మీమ్స్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, సమంత కేరళ స్టూడెంట్ కానీ ఆమె మార్క్ షీట్‌లో తమిళ లాంగ్వేజ్ ఉంది.

అదికాక మార్క్ షీట్ లో ఇచ్చిన ఇయర్ ప్రకారం సమంత 14 ఇయర్స్ కే టెన్త్ పాస్ అయినట్లు తెలుస్తోంది, ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు నటిజెన్లు కామెంట్ చేశారు. ఇదంతా ఆమెకున్న హైప్ పెంచడం కోసం ఆమె పిఆర్ చేస్తున్న నాటకం అని కొందరు నెటిజన్స్ మండి పడుతున్నారు. చైతుతో డైవర్స్ తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సమంత కు ఇది మరో వివాదంగా తయారవుతుందా….అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న మార్క్ షీట్ జరిగిన ఈ మిస్టేక్ కు సమంత ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి.


End of Article

You may also like