Home Filmy Adda ఆగస్ట్ 15న విడుదలైన ప్రభాస్ “సలార్” కొత్త పోస్టర్‌లో… ఇది గమనించారా..?

ఆగస్ట్ 15న విడుదలైన ప్రభాస్ “సలార్” కొత్త పోస్టర్‌లో… ఇది గమనించారా..?

by Mohana Priya

తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.

మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు.

did you observed this in salaar movie independence day poster

బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 15 రోజు ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ విడుదల చేసారు. అంతే కాకుండా ఆ పోస్టర్ మీద సినిమా విడుదల తేది కూడా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కొంత మంది మనుషుల మధ్య చేతిలో కత్తి పట్టుకొని నిల్చొని ఉన్నారు. వెనకాల కొన్ని హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే కొంత మంది నెటిజన్లు ఇది సినిమాకి సంబంధించిన ఒక క్లూ అని అంటున్నారు.

salaar movie prabhas entry scene dialogue leaked

ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాకి సంబంధం ఉంది అంటూ ముందు నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సరిగ్గా గమనిస్తే వెనకాల కనిపించే హెలికాప్టర్స్ కేజీఎఫ్ సినిమాలో కనిపించినవి అని, అవి రాకీ భాయ్ హెలికాప్టర్స్ అని, నిజంగానే రెండు సినిమాలకి మధ్య ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాలో యష్ ఒక పాత్రలో కనిపిస్తారు అనే వార్త కూడా గత కొద్ది రోజుల నుండి ప్రచారంలో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే విక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ అలా ఒక మల్టీవర్స్ కాన్సెప్ట్ తీసుకువచ్చిన సినిమా ఇదే అయ్యే అవకాశాలు ఉన్నాయి.

You may also like