Home Filmy Adda ఇదేంటి నీల్ మావా..? ఇంత పని చేశావు..? “ప్రభాస్” ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్..!

ఇదేంటి నీల్ మావా..? ఇంత పని చేశావు..? “ప్రభాస్” ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్..!

by Mohana Priya

తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.

మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు.

did you observed this in salaar movie independence day poster

బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 15 రోజు ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ విడుదల చేసారు. అంతే కాకుండా ఆ పోస్టర్ మీద సినిమా విడుదల తేది కూడా ప్రకటించారు.

reason behind prabhas movies disappoing after bahubali

అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అవుతుంది అని చెప్పారు. వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ లో విడుదల అవుతుంది అని చెప్పారు. అయితే అదే రోజు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా కూడా విడుదల అయ్యింది. రెబల్ సినిమా టీజర్, ట్రైలర్ కూడా మొదట్లో చాలా స్టైలిష్ గా అనిపించాయి. ప్రభాస్ లుక్ చూసి సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అని అనుకున్నారు. కానీ సినిమా ఫలితం మాత్రం వేరే లాగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఫాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. కొంచెం డేట్ మార్చవచ్చు కదా అనే కామెంట్స్ వస్తున్నాయి.

You may also like