బాక్సర్ “మైక్ టైసన్” కి ఏమయ్యింది..? ఇలా అవ్వడానికి కారణమేంటి..?

బాక్సర్ “మైక్ టైసన్” కి ఏమయ్యింది..? ఇలా అవ్వడానికి కారణమేంటి..?

by Mohana Priya

Ads


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లైగర్, ఆగస్ట్ 25న 5 భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. కాగా బాక్సింగ్ కథనంతో రానున్న ఈ సినిమాలో, ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇదిలా వుండగా… మైక్ టైసన్ ఆరోగ్యం విషయంలో కొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఇది తెలిసిన వెంటనే అభిమానులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.

Video Advertisement

ఎంతో ఉత్సాహంగ కనిపించిన టైసన్ అలా చూసి కొందరు అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. అయితే మియామీ ఎయిర్ పోర్ట్ లో టైసన్ బైటకి వస్తుండగా… వీల్ చేయిర్ లో కూర్చుని కర్ర పట్టుకుని వస్తున్న దృశ్యం, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బాక్సర్ అయిన మైక్ ను ఆ దుస్థితిలో చూసి, ప్రజలు వాపోయారు.

minus points in vijay devarakonda liger trailer

ఏమైంది టైసన్ కి, ఎందుకు అలా ఉన్నారు అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు వివరాల్లోకి వెళితే, టైసన్ ఎప్పటినుంచో వెన్నుముక నొప్పితో బాధ పడుతున్నారట. ఈ మేరకు వీల్ చైర్ లో కూర్చోవాలని డాక్టర్లు సూచించారట. అందుకోసమే టైసన్ అలా కనిపించారని తెలుస్తోంది. లైగర్ మూవీ ప్రమోషన్స్ లో నడుస్తుండగనే టైసన్ ఈ స్థితికి రావడం, ఎంతో విషాదకరం అంటున్నారు అభిమానులు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ విషయానికి వేస్తే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పోరాడి, బాక్సింగ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. ఆయన జూన్ 30 వ తారీకు 1966లో జన్మించారు. అతి చిన్న వయసులోనే బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు.

ఎన్నో అద్భుతమైన మ్యాచులను ఆడగా 50 విజయాలను,20 ఓటముల తన బ్యాకింగ్ చరిత్ర ఖాతాలో వేసుకున్నారు. మొదట్లో బాక్సింగ్ మీద పిచ్చితో, మైక్ స్ట్రీట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ విషయంలో జైలుకు కూడా వెళ్లారు. మరోసారి 1997లో మ్యాచ్ లో మైక్ అపోనెంట్ ఇవాండర్ హోలీఫీల్డ్ చేవి కొరకడంతో మళ్ళీ జలు పాలయ్యారు. ఇలా అనేక కారణాల చేత సుమారు 38 సార్లు మైక్ జైలుకి వెళ్లారు.అలాంటి మైక్ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల రీత్యా, ఒకసారి తనకు చివరి గడియలు వచ్చేసాయని చెప్పిడం గమనార్హం. ఇక త్వరలో తన వృత్తికి సంబంధించిన సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ దేవరకొండ సరసన అనన్య పాండే కూడా నటిస్తోంది. ఈ సినిమాపై సినీ అభిమానులకి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మైక్ ఆరోగ్యం బాగు పడాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.


End of Article

You may also like