Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ట్రైలర్ కి అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా కూడా చాలా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.
Video Advertisement
ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎన్నో టీవీ ఛానెల్స్ కి, యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా నెటిజన్లతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. సినిమాకి ఎంత మంచి పబ్లిసిటీ వస్తోందో అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సినిమా బృందం సినిమా హిట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొన్ని ఇంటర్వ్యూలలో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు మాత్రం కాస్త అతిగా ఉన్నాయి అని అంటున్నారు.
ఇటీవల డైరెక్టర్ పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ కలిసి ఛార్మి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సోషల్ మీడియాలో కొంతమంది అడిగిన ప్రశ్నలని ఛార్మి అడిగారు. అందులో, “ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు?” అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ, “నేనైతే 200 కోట్ల నుండి లెక్కపెట్టడం మొదలు పెట్టాను” అని చెప్పారు. అంటే సినిమా మినిమం 200 కోట్లు కచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. దాంతో సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే కానీ ఇలాంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు.
అంతే కాకుండా మరొక ఇంటర్వ్యూలో ఈ సినిమా పక్కా తెలుగు సినిమా అని, అసలు హిందీ సినిమా చూస్తున్నట్టు ఒక్క చోట కూడా కనిపించదు అని చెప్పారు. కానీ పాటలు అన్నీ హిందీలోనే ఉన్నాయి. అసలు ఇది కేవలం తెలుగులోనే తీద్దాం అనుకున్న సినిమా అని, తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా మార్చారు అని సమాచారం. దాంతో చాలా మంది, “ఇంత ఎక్కువగా చెప్తున్నారు. ఒకవేళ సినిమా ఫలితం కాస్త తేడా కొట్టినా సరే ఇదంతా ట్రోలింగ్ కి గురి అవుతుంది” అని అంటున్నారు.
End of Article