Ads
- చిత్రం : లైగర్
- నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్.
- నిర్మాత : పూరి జగన్నాధ్, చార్మి, కరణ్ జోహార్
- దర్శకత్వం : పూరి జగన్నాధ్
- సంగీతం : విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, లిజో జార్జ్-DJ చీతాస్, సునీల్ కశ్యప్, జాని.
- విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2022
Video Advertisement
స్టోరీ :
లైగర్ (విజయ్ దేవరకొండ), తన తల్లి (రమ్య కృష్ణన్) కరీంనగర్ కి చెందినవారు. వారిద్దరూ కలిసి ముంబైకి వెళ్తారు. లైగర్ ని తన తల్లి ఎంఎంఏ ట్రైనింగ్ లో చేరుస్తుంది. తర్వాత లైగర్ కి ఎదురైన పరిస్థితులు ఏంటి? లైగర్ అంతర్జాతీయ స్థాయి ఎంఎంఏ ఫైటర్ అవ్వగలిగాడా? అసలు తాన్య (అనన్య పాండే) ఎవరు? లైగర్ తాన్యని ఎలా కలిశాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది.
ట్రైలర్ చూశాక చాలామంది ట్రైలర్ అనుకున్న స్థాయిలో లేదు అని అన్నారు. ఇలా కాకపోయినా సినిమా బాగుంటే చాలు అని అన్నారు. సినిమా బృందం కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అసలు చెప్పిన దానికి, చూపించిన దానికి సంబంధం లేదేమో అనిపిస్తుంది. సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూసాం. చాలా సినిమాల వరకు ఎందుకు, దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాల్లోని చాలా సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. హీరో పాత్రకి నత్తి ఎందుకు పెట్టారు అనే విషయం మాత్రం అర్థం కాలేదు.
సినిమాకి అతిపెద్ద బలం విజయ్ దేవరకొండ. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత కష్టపడ్డారో తెరపై కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడినప్పుడు అలా నత్తిగా కాకుండా మామూలుగా మాట్లాడితే బానే ఉండేదేమో అనిపిస్తుంది. కానీ లుక్ పరంగా విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. అలాగే ఈ సినిమాలో డాన్స్ కూడా చాలా బాగా చేశారు. విజయ్ దేవరకొండ తర్వాత అంతగా హైలైట్ అయ్యారు రమ్య కృష్ణన్. హీరోయిన్ అనన్య పాండే నటనపరంగా ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చూడటానికి బాగున్నారు. డాన్స్ బాగా చేశారు. కానీ ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్ పాత్ర లాంటిదే ఈ సినిమాలో అనన్య పాండే పోషించారు.
అనన్య పాండే మాట్లాడే డైలాగ్స్ కూడా దాదాపు హిందీలోనే ఉంటాయి. అవి తెలుగులో డబ్ చేసినట్టు అర్థం అవుతూ ఉంటాయి. సహాయ పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలు పరిధి మేరకు బానే నటించారు. సినిమా చూస్తున్నంత సేపు అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమా గుర్తొస్తూ ఉంటుంది. అసలు పాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. పాటలు అన్నీ కూడా హిందీలోనే ఉన్నాయి. అవి డబ్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల అసలు ఇది తెలుగు సినిమానేనా అనే అనుమానం కూడా వస్తుంది. అంత హైప్ చేసిన మైక్ టైసన్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా చాలా మామూలుగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- విజయ్ దేవరకొండ
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- హీరోయిన్ పాత్ర
- అనవసరంగా వచ్చే పాటలు
- సహనాన్ని పరీక్షించే కొన్ని ఫైటింగ్ సీన్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి కొత్తదనం ఏమీ ఆశించకుండా, అలాగే కాంబినేషన్ చూసి సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అనుకోకుండా, ఏదో ఒక యాక్షన్ సినిమా చూద్దాం అనుకునే వారికి లైగర్ ఒక్కసారి చూడగలిగే సినిమాగా అనిపిస్తుంది.
End of Article